మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Spread the love

 

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

చేవెళ్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్‌జీటీ యూనియన్ చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌జీటీ చేవెళ్ల మండల అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ మహిళా సాధికారత, హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన పెరగాలని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు కృషి, పట్టుదలతో వివిధ రంగాల్లో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి లక్ష్మీ మాట్లాడుతూ కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తు నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్‌జీటీ యూనియన్ అధ్యక్షుడు బి. గణేష్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు లాలయ్య, సీనియర్ మహిళా ఉపాధ్యాయులు శశికళ, కమల, విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment