మనుషులు రాసిన మరణ శాసనం.
భూమి మీద అనేక జీవరాశులు మనుగడ సాగిస్తూ జీవిస్తున్నాయి అందులో అన్నింటికీ మనిషి తనకున్న జ్ఞానంతో అన్ని జీవరాశులకన్న మిన్నగా బతుకుతున్నాడు ,తన సౌకర్యం కోసం ప్రకృతినీ పర్యావరణాన్ని పాడుచేస్తూ సహా ఇతర జీవరాశులకు బతకలేని పరిస్థితులను కల్పించే విధంగా తన జీవన ప్రయాణం సాగిస్తున్నాడు.తన సౌకర్యం జిహ్వచాపల్యం కోసం అనేక జీవ చరాల ను చంపి తింటున్నాడు.అనేక చెట్లను నరికేస్తూ ప్రకృతి ని పాడు చేస్తున్న సందర్భం.
ప్రస్తుత పరిస్థితుల్లో తన అవసరాలకోసం ప్లాస్టిక్ వాడకాన్ని దైనందిన జీవితం లో నిత్యకృత్యం చేసుకున్నాడు.ప్లాస్టిక్ వాడకం తో తమ ఆరోగ్యానికి హాని చేటు తెచ్చుకుంటున్నారు
తాము వాడుకొని పడేసిన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను మూగ జీవాలైన పశువులు తెలియక తమ ఆహారంగా భావించి నిరుపయోగ ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోతున్న సందర్భం నేడు నెలకొని ఉన్నది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసి పోని గుణాలను కలిగి భూమిని పర్యావరణ వ్యవస్థ ను నాశనం చేస్తున్నది.
మనం మన అవసరాల కోసం వాడే ప్లాస్టిక్ బ్యాగులు
అవసరం తీరాక బయట పడేస్తున్నాం .వాటిని కొన్ని మూగ జీవాలైన పశువులు ఇ తరములు తిని ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది
వాటి ప్రాణాలు పోయి శరీరం కుళ్ళి బొక్కలుగా మిగిలినా తాము తిన్న ప్లాస్టిక్ అవశేషాలు అలాగే ఉండడం చూస్తున్నాం.
మనిషి ఙ్ఞానం తన మెరుగైన జీవన విధానం కోసం అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు తెచ్చుకునీ జీవ వైవిధ్యం ను హరిస్తూ ఇతర సహచర మూగ జీవచరాలకు మనుగడ లేకుండా చేస్తూ తన మనుగడను ప్రమాదం లోకి నెట్టి వేసుకుంటున్నాడు
మనిషి ఙ్ఞానం పెంచుకోవడం లో తప్పులేదు గానీ అది ఇతర జీవులకు తనకు ముప్పుగా మారే ప్రమాదకారిగా ఉండడం సర్వత్రా సహేతుకం కాదన్నది …..మన ఆలోచనలు ప్రవర్తనలు నూతన ఆవిష్కరణలు సర్వే ప్రాణి సుఖీభవ అనే విధంగా ఉండాలని ఉంటాయని కోరుకుందాం ……………🚩.👇
డా విజయకుమార్ జాతీయ అవార్డ్ గ్రహీత