10 వ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన కొందుర్గ్ విద్యార్థులు.
2025.26విద్యా సంవత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన 10 వ తరగతి పరీక్షల ఫలితాల లో కొందుర్గ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.132 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 118 మంది ఉత్తీర్ణులయ్యారు.89 శాతం ఫలితాలను పొందారు.500 పైగా మార్కులను 5 మంది,400 కు పైగా మార్కులను 32 మంది సాధించారు.కొందుర్గ్ ఉన్నత పాఠశాల . కొందుర్గ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మణి తేజ 545 ,.సూరజ్ 523,గౌతమి 521,మౌనిక 509 ,గణేష్ 500 మార్క్స్ తో మంచి ఫలితాలు సాధించారు.ఈ సందర్భంగా కొందుర్గ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీనాథ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థులు క్రమ శిక్షణతో ఉంటూ,పెద్దలు చెప్పిన మంచి విషయాలను ఆచరణ లో పెట్టినట్లయితే ,భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని,దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుందని సీనియర్ ఉపాధ్యాయురాలు మంజుల ,పావని లు తెలిపారు. కొందుర్గ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను ఉపాధ్యాయ బృందం యొక్క కృషి కి గ్రామ పెద్దలు,గ్రామస్థులు పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.

Marks : 545

Marks : 523

Marks : 521

Marks : 509

Marks : 500