మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్
అక్కడ నష్టపోతున్న వారందరికీ 1000 కోట్ల రూపాయల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తాం
హామీ ఇచ్చిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తుండగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) వేరే సురక్షితమైన గెటెడ్ కమ్యూనిటీలో ‘Ready to Occupy’ ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంది
లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించడం జరగుతుంది – రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
అయితే ఇదే తరహాలో నష్టపోతున్న కిస్మత్ పూర్, ఇతర మూసీ ప్రాంతాలు, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇలాగే నష్ట పరిహారం ఎందుకు చెల్లించరు అనే చర్చ మొదలైంది