చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం
చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి సౌజన్యంతో చేవెళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని మొత్తం 360 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పరీక్షల సందర్భంగా 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి మరియు dr వైభవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చని తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్స్ పేదోళ్ల దయాకర్, మనీషా అనంత్ రెడ్డి, మీనాక్షి సత్యనారాయణ, మరియు బీజేపీ నాయకులు మాణిక్య రెడ్డి, శర్వలింగం, ఇంద్రసేన రెడ్డి, అశోక్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అభిశేఖర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పాగా వెంకటేష్, చాకలి శ్రీనివాస్ కృష్ణ రెడ్డి, జైసిమహ రెడ్డి, రవి మరియు బిజెపి నాయకులు చేవెళ్ల గ్రామస్తులు పాల్గొన్నారు.