ప్రజల సేవే నా బాధ్యత : కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి
చేవెళ్ళ:
5వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన రాజకీయ ప్రయాణంలో ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. వార్డులో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పని చేస్తానని అన్నారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు, పెద్దలు, యువత, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని సహకరించాలని ఆయన కోరారు. వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా వెంకట్‌రాంరెడ్డి స్పష్టం చేశారు.