అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్
చేవెళ్ళ:
చేవెళ్ల,మున్సిపల్ 11వ వార్డు (ఇబ్రహీంపల్లి) నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎండి జాహిద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన మార్గమని, వార్డు సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలతో కలిసి 11వ వార్డుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఆశీర్వదించాలని కోరుతూ, ప్రజలు ఉంచే నమ్మకాన్ని ఎప్పటికీ వృథా చేయనని తెలిపారు.