చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరెళ్ళ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాయికాడి నర్సిములు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సిములు, అశోక్, జనార్దన్, అనీల్, బన్నీ, ఆదర్శ్ సహా సుమారు 25 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీపీ విజయ లక్ష్మి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, అభిమానులు తదితరులు బీజేపీలో చేరడం జరిగింది. ఈ చేరికలతో మండలంలో బీజేపీ బలం మరింత పెరిగిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.