రంగారెడ్డి : చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
మహేందర్ రెడ్డి కామెంట్స్ :-
స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిర్మించిన భారత రాజ్యాంగ సూత్రాలు లక్ష్యాలను
జాతీయ నాయకులు కలలుగన్న విధంగా అమలు పరచుకొని ప్రపంచంలోనే భారతదేశాన్ని అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుకుందాం.
మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారి కలలను సకారం చేస్తూ యువత తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్మించుకునేలా క్రమశిక్షణతో, కార్యాచరణతో ముందుకు సాగాలి.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో అలాగే అనారోగ్యంతో వస్తున్న నిరుపేదలకు చేవెళ్లలోని మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ లో వైద్యులు చేస్తున్న సేవలు అభినందనీయంగా ఉన్నాయి.
పాల్గొన్న ప్రిన్సిపల్ జోయారాణీ, అకాడమిక్ డైరెక్టర్ గౌరీ, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, ఏజీఎం రవివర్మ, వినోద్ రెడ్డి, మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
వీరేందర్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,రఘువీర్ రెడ్డి,కేసారం ప్రతాప్ రెడ్డి, రమేష్,
మాజీ ఎంపి టీసీ రాములు, మొయినాబాద్ నేతలు మహేందర్ రెడ్డి,కంజర్ల ప్రకాష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.