ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

Spread the love

 

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

 

ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉండేవాడు. భర్త బతికి ఉండటం కంటే చనిపోతేనే తాను సంతోషంగా ఉంటానని భావించిన భార్య‌.. త‌న‌ భర్త పేరున రూ. 66 లక్షల బీమా చేయించింది.

 

దీంతో ఈ నెల 2న మరో నలుగురితో కలిసి భార్య ప్రశాంతి అతనికి బాగా మద్యం తాగించి.. మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తుండగా కారుతో ఢీకొట్టి చంపారు.

 

ఆ తర్వాత తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతిపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Leave a Comment