రేపటి నుంచి మూడు కాలనీలకు నీటి సరఫరా
చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11 వార్డులో బాలాజీ నగర్, గణేష్ నగర్, శాంతినగర్ కాలనీలలో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సమస్యను పరిష్కరించేందుకు 11 వార్డు కౌన్సిలర్ ఫైండ్ల మధుసూదన్ రెడ్డి చొరవతో తీసుకొని కొత్త పైప్ లైన్ వేయించి మూడు కాలనీలకు నీటిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రంలోపు పనులు పూర్తవుతాయని, రేపు ఉదయం నుంచి ప్రతి కాలనీకి వాటర్ సరఫరా అవుతుందని కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.