రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని వరంగల్ డీసీసీ సభ్యులు కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రామసహాయం కిషోర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. దేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి రాజ్యసభలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.