కేజీబీవీకి సౌండ్ సిస్టమ్ అందజేత
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భాజపా చేవెళ్ల నాయకులు అతెళ్లి మధుసూదన్ రెడ్డి – సాహితీ దంపతుల కుమారుడు అనిరుద్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను విద్యాలయానికి అందజేశారు. విద్యార్థినుల విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సౌండ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అవసరాలను గుర్తించి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి సమాజం నుంచి వస్తున్న మద్దతు ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంత్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు దాతలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.