*సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ- ఫారం స్వీకరణ*
– 11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్
చేవెళ్ళ:
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీ – ఫారం అందుకోవడం గర్వకారణమని ఎండి జాహేద్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ-ఫారం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించి 11వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. వార్డులో ప్రజల నుంచి విశేష మద్దతు, పెద్దల సంపూర్ణ సహకారం లభిస్తోందని పేర్కొంటూ.. దీనితో తన గెలుపు ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనకు ప్రధాన బలమని తెలిపారు. 11వ వార్డు ప్రజల ఆశీర్వాదం తనపై నిండుగా ఉందని తెలిపారు.