చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్

Spread the love

📰 *చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్*

 

చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సభ్యుడిగా బీ. రాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా *పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు బీ-ఫారాన్ని అధికారికంగా అందజేశారు.*

 

ఈ కార్యక్రమం *_రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ (అడ్వకేట్) గారి నేతృత్వంలో నిర్వహించబడింది. అలాగే చేవెళ్ల మండల అధ్యక్షులు కల్వకుర్తి అశోక్ (అడ్వకేట్) మరియు ప్రదీప్ పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు._*

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ. రాజును భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో కృషి చేస్తాయని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాపక్ష విధానాలను ప్రతి గడపకు చేర్చేలా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

 

🔹 ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, అధికార ప్రతినిధి శంకరొళ్ల సురేష్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుక

Leave a Comment