ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు కొనసాగించాలి: కాంగ్రెస్ డిమాండ్

Spread the love

 

చేవెళ్ల: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల మండలం మూడిమ్యాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద మాజీ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… గాంధీ పేరును తొలగించే ప్రయత్నం దురుద్దేశపూరితమని, నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, గోనె జంగారెడ్డి, గోనె శ్రీనివాస్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment