తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో రాహుల్ బంధు పథకం

తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో రాహుల్ బంధు పథకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔹రాష్ట్రంలో రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాడు 🔹రైతుబంధు నిధులను ఈ రాహుల్ బంధు పథకానికి పంపిస్తున్నారు 🔹రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా రైతుల నిధుల్ని పంపుతున్నారు 🔹అందుకే నాలుగు సార్లు రైతుబంధును ఎగ్గొట్టారు 🔹రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును పక్కనపెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటున్నాడు … Read more

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని వరంగల్ డీసీసీ సభ్యులు కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రామసహాయం కిషోర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. దేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి రాజ్యసభలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేజీబీవీకి సౌండ్ సిస్టమ్ అందజేత చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భాజపా చేవెళ్ల నాయకులు అతెళ్లి మధుసూదన్ రెడ్డి – సాహితీ దంపతుల కుమారుడు అనిరుద్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను విద్యాలయానికి అందజేశారు. విద్యార్థినుల విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సౌండ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ … Read more