11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈసీ

Spread the love

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈస

 

_హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 : మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది._

 

_అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది._

 

_ప్రైవేట్‌ పరిశ్రమలకు కూడా ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎస్‌ఈసీ సూచించింది. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒకరూ భాగస్వామ్యం కావాలని, పోలింగ్‌ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సెలవును ప్రకటిస్తున్నట్టు అధికారులు తెలిపారు._

Leave a Comment