పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్

Spread the love

పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్

చేవెళ్ల : సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. చేవెళ్లలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ… పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాలవారు సోదరభావంతో మెలగాలని సూచించారు. పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటేనే పౌరహక్కులను సమా నంగా అనుభవిస్తారని తెలిపారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటి వారు సహకరిం చాలన్నారు. అన్ని గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని జరుపుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్పర్ హాస్టల్ వెల్పర్ అధికారి శ్రీపావని, డిప్యూటీ తహశీల్దార్ రాజేందర్, చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Comment