ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను

Spread the love

ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను

పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది.

ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది.

GST పరిహార సెస్‌కు బదులుగా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసినట్లు సమాచారం.

తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..,

వర్తించే GST రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించనున్నారు.

ఈ నిర్ణయంతో పాన్‌మసాలా, సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Comment