మండల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రౌండ్ చుట్టూ కడిలు, తారు పనులు
మడికట్టు గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ జయలత బాల్ రెడ్డి గారు గ్రామాభివృద్ధి పట్ల తమ బాధ్యతను మరోసారి నిరూపించారు. గ్రామ ప్రాథమిక పాఠశాల గ్రౌండ్ చుట్టూ తమ సొంత నిధులతో కడిలు ఏర్పాటు చేసి, తారు చుట్టింపించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన భద్రత కల్పించారు.
ఇంతకు ముందు పాఠశాల గ్రౌండ్ చుట్టూ సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు ఆటల సమయంలో బయటకు వెళ్లే అవకాశం ఉండేది. అలాగే వర్షాకాలంలో మట్టి, బురద కారణంగా పాఠశాల పరిసరాలు అశుభ్రంగా మారేవి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునిమాజీ ఉపసర్పంచ్ జయలత బాల్ రెడ్డి గారు స్వయంగా ముందుకు వచ్చి పనులు చేపట్టించారు.
ఈ పనుల వల్ల పాఠశాల గ్రౌండ్ స్పష్టమైన సరిహద్దులతో భద్రంగా మారడమే కాకుండా, పాఠశాల వాతావరణం మరింత శుభ్రంగా, క్రమబద్ధంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఉపసర్పంచ్ జయలత బాల్ రెడ్డి గారి సేవాభావాన్ని కొనియాడుతున్నారు.
ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్వయంగా ఖర్చు చేసి చేసిన ఈ అభివృద్ధి పనులు గ్రామంలో మంచి ఆదర్శంగా నిలిచాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.