చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ టికెట్లపై వాడి వేడి చర్చ

Spread the love

 

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ టికెట్ల వ్యవహారం అధిష్టానం దృష్టికి చేరింది. చైర్మన్ పదవి కోసం పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపు విషయమై శనివారం వాడి వేడి చర్చ జరిగింది. చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి నివాసం ఈ సమావేశానికి వేదికైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తో పాటు ప్రభుత్వ చీప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పామెన భీమ్ భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వేర్వేరుగా అభ్యర్థుల జాబితాను అధిష్టానం ముందు ఉంచారు. అయితే అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి రాలేదు. మరోమారు సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.

Leave a Comment